News

నవరత్నాలు కాదు గులకరాళ్లు:యనమల


ప్లీనరీలో వైసీపీ ప్రకటించింది నవరత్నాలు కాదని, 9 గులకరాళ్లని మంత్రి రామకృష్ణుడు విమర్శించారు. వైసీపీ హామీల బడ్జెట్ పై చర్చ అనవసరం, అసందర్భం అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ విధ్వంసక ధోరణిపై ప్రజలు భయపడుతున్నారని ఆయన అన్నారు. వైసీపీ ఇచ్చినవి కొత్త హామీలేమీ కాదని తెలిపారు. దశలవారీ మద్య నిషేధం 2004లో చెప్పిందే, కొత్తదేమీ కాదన్నారు. 24లక్షల మంది రైతులకు రూ.50వేలు ఒకే దఫాలో చెల్లించామని ఆయన తెలిపారు.